ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర శాసనమండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…ఖాళీగా ఉన్న 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. మెరుగైన విద్యాను రాష్ట్రంల అందిస్తున్నామని బొత్స వెల్లడించారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఏపీలో 40వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు అన్నారు. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఎనిమిదివేల టీచర్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారని..సరికాదన్నారు. మెగా డీఎస్సీని ప్రకటించాలని లక్ష్మణ రావు డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స అదిరిపోయే శుభవార్త.. త్వరలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏ శాఖలో అంటే?
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలోనే 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు వివరాలు చూద్దాం.

Translate this News:











