Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉభయసభలు ఎన్నిసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా.. ఉభయ సభల్లో టీడీపీ(TDP) సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను వాయిదా వేసి మళ్లీ మొదలు పెట్టినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాంతో ఒకానొక దశలో స్పీకర్ మార్షల్స్‌ని సభలోకి పిలిపించారు. స్పీకర్ పోడియం చుట్టూ వారిని సెక్యూరిటీగా పెట్టుకున్నారు. అయితే, టీడీపీ సభ్యులు మార్షల్స్‌ని తోసుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో అలర్ట్ అయిన మార్షల్స్.. వారిని అడ్డుకున్నారు. సభలో విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు.
పూర్తిగా చదవండి..AP Assembly: గందరగోళంగా ఏపీ అసెంబ్లీ.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉభయసభలు ఎన్నిసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను వాయిదా వేసి మళ్లీ మొదలు పెట్టినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ వచ్చారు.

Translate this News:











