Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రశ్రోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. అయితే, సభ తొలి రోజు నుంచే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు పట్టుబడుతోన్న టీడీపీ.. ఇవాళ కూడా అదే పట్టుదలతో సభలోకి రానుంది. ఇదే అంశంపై నిన్న వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. 2వ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. నిన్న సభ మొత్తం టీడీపీ నేతల ఆందోళనలతో దద్దరిల్లింది. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, మంత్రులు, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగడం, కొందరు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం.. వంటి చర్యలతో మొదటి రోజు ముగిసిపోయింది.
పూర్తిగా చదవండి..AP Assembly: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రశ్రోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు టీడీపీ పట్టుబడుతోంది. ఇదే అంశంపై 2వ రోజు వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి.

Translate this News:











