మొత్తానికి మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించనున్నారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు కూడా మద్దుతు పలుకుతున్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ భారతదేశంలో పార్లమెంటు,శాసనసభల్లో 14 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది…కరెక్టే కానీ ఇది పూర్తిగా అమల్లోకి రావాలంటే మాత్రం 2027 లేదా 2029 వరకూ ఆగాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..డీ లిమిటేషన్ తర్వాతనే మహిళకు రిజర్వేషన్లు దక్కేది
నూతన పార్లమెంటు భవనంలో జరిగిన మొదటి లోక్ సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దానికి సంబంధించిన వివరాలు...

Translate this News:











