ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా ప్రభుత్వ ఆరోపణలను నిరాధారమైనదిగా పేర్కొంది. మేము చట్టాన్ని విశ్వసిస్తామని తెలిపింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని కెనడాను కూడా భారత్ డిమాండ్ చేసింది. ఖలిస్తానీల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రకటనలు చేశారని భారత్ పేర్కొంది.
పూర్తిగా చదవండి..కెనడా ప్రభుత్వ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్..కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రం..!!
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.

Translate this News:











