మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ జరగింది. అప్పటి నుంచి వారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని మెగా అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నవంబర్ 1న శుభ ముహూరతం కుదిరినట్లు సమాచారం. వరుణ్ లావణ్యలు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరుణ్- లావణ్య తమ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూంలో ఈ జంట సందడి చేసింది. పెళ్లి షాపింగ్ కోసం వీరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన డ్రెస్సులను మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్ళి సందడి
మెగా ఫ్యామిలీలో మళ్ళీ పెళ్ళా బాజాలు మోగనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందని...వాళ్ళింట్లో పెళ్ళిపనులు హడావుడి మొదలైందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

Translate this News:











