భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ ‘సేవా పఖ్వాడా’ను ప్రారంభించింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నమో యాప్‌లో ‘ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్’ ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. దేశానికి సేవ చేసే దిశగా దేశ పౌరులను ప్రేరేపించడమే ఈ ప్రచారం లక్ష్యం. ఈ ఏడాది ప్రతి భారతీయుడు నమో యాప్‌ని ఉపయోగించి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పవచ్చు. మీరు వీడియో సందేశం ద్వారా కూడా ప్రధాని మోదీకి మీ శుభాకాంక్షలు పంపవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్లో నమో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారందరి వీడియోలు వీడియో వాల్‌పై ప్రదర్శిస్తారు.
పూర్తిగా చదవండి..PM Modi: మీరు మోదీ అభిమానినా? NaMo యాప్‌లో నేరుగా బర్త్ డే విషేస్ ఇలా చెప్పండి…!!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మీరు కూడా ప్రధానమంత్రికి నేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే మీరు నమో యాప్‌లో ఈ సదుపాయాన్ని పొందుతారు. నమో యాప్ ద్వారా ప్రధాని మోదీకి వీడియో సందేశాలు పంపవచ్చు.

Translate this News:











