AP Home Minister Vanitha: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత(Home Minister Vanitha) స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ, ఆయనే తన రాజకీయ స్వలాభం కోసం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారని చంద్రబాబు తీరును విమర్శించారు హోంమంత్రి వనిత. ఇదే విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని, చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా డే వన్ నుంచి ఆయనకు గౌరవం ఇచ్చామన్నారు మంత్రి. కానీ, చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నారు.. హోంమంత్రి వనిత సంచలన కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

Translate this News:











