INDIA Alliance Boycott TV news anchors: దేశ వ్యాప్తంగా కొంతమంది న్యూస్ యాంకర్లు హోస్ట్ చేసే షోలను బహిష్కరిస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. ఈ మేరకు సదరు యాంకర్ల జాబితాను విడుదల చేసింది. తాజాగా జరిగిన ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. ఇదే అంశంపై కాంగ్రెస్ ముఖ్య నాయకుడు కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ”ఇండియా అలయన్స్ పార్టీలు ఏవీ తమ ప్రతినిధులను సదరు యాంకర్ల షోకు పంపొద్దని నిర్ణయించడం జరిగింది” అని వెల్లడించారు. ఆ యాంకర్లను పేర్లను మీడియా సబ్ గ్రూప్ వెల్లడిస్తుందన్నారు. కేసీ వేణుగోపాల్ ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా.. మరుసటి రోజుల ఇండియా కూటమి బహిష్కరించిన 14 మంది యాంకర్ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది సబ్ కమిటీ. ఈ యాంకర్లు ఎప్పడు ద్వేషపూరిత వార్తలను, చర్చలను నిర్వహిస్తారని, దేశంలో విద్వేషాలను రగిల్చే అంశాలనే ప్రధాన అజెండాగా డిబేట్స్ పెడతారని ఇండియా కూటమి ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీరి షోల కు తమ పార్టీల నేతలను పంపబోమని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..INDIA Alliance: ఆ టీవీ యాంకర్స్‌ను బహిష్కరించిన ఇండియా కూటమి.. లిస్ట్ పెద్దదే..
దేశ వ్యాప్తంగా కొంతమంది న్యూస్ యాంకర్లు హోస్ట్ చేసే షోలను బహిష్కరిస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. ఈ మేరకు సదరు యాంకర్ల జాబితాను విడుదల చేసింది. తాజాగా జరిగిన ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు.

Translate this News:











