Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న ఘటనలో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పిటిషన్ ఈరోజు విచారణకు రాగా.. ఈ కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యాంత్ రెడ్డి కోరారు.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: అంగళ్ళు విధ్వంసం కేసు .. విచారణ ఏప్పుడంటే..?
అంగళ్లు విధ్వంసం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో A1గా చంద్రబాబుపై కేసు నమోదయింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. ఈ కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యాంత్ రెడ్డి కోరారు. అయితే చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి.

Translate this News:











