Congress strategy to win Telangana assembly polls: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యుహా రచనలో నిమగ్నమయ్యాయి. అధికార బీఆర్ఎస్(BRS) సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ప్రతిపక్షాలు ప్రజల్ని ఆకట్టుకునేలా మేనిఫెస్టో(Manifesto) రూపొందించే పనిలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించింది. తాజాగా మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమైంది. అయితే, అంతకు ముందు కర్ణాటక ఎన్నికల ముందు మాదిరిగా తెలంగాణలో కూడా ఐదు గ్యారెంటీలను ఇవ్వడానికి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన మాదిరిగానే.. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.
ఐతే, ఆ ఐదు గ్యారెంటీలు ఏమిటన్న అంశంపై పార్టీ నేతలు గుంభనంగా ఉంటున్నారు. ఈ నెల 17న తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహిస్తున్నారు. ఆ బహిరంగ సభలో సోనియాగాంధీ చేత తెలంగాణలో అమలుచేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని విడుదల చేయించాలని కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
Telangana Politics: ఆ గ్యారెంటీలు.. గట్టెక్కిస్తాయా? బీఆర్ఎస్ని ఓడించేందుకు పంచతంత్రం..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణాలైన ఐదు గ్యారెంటీలే స్ట్రాటజీని ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించగా అవి కాకుండా అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Translate this News:











