ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇళ్లలోనే ఉండిపోతూ బాధపడుతున్నారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో స్కామ్ కేసుల్లో ఎన్నడూ కూడా జైలు జీవితం గడపని చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇది ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఓ విషాద వార్తను పోస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..Chandrababu scam case: ఆవేదనతో ఆగిన గుండె.. చంద్రబాబు అరెస్ట్ వార్తతో మరో వ్యక్తి మృతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్త ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. కొందరు తమ ప్రియతమ నాయకుడి అరెస్టును తట్టుకోలేకపోతున్నారు. దీని కారణంగా విషాదకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్‌ని తట్టుకోలేక దాదాపు 14మంది చనిపోయినట్టు సమాచారం. తాజాగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన, టీడీపీ మైనారిటీ కార్యకర్త షేక్ హుస్సేన్ సాహెబ్ గుండెనొప్పితో మరణించారు.

Translate this News:











