హైదరాబాద్‌లోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొని వచ్చిన గ్యాంగ్ సభ్యులు అమ్ముతున్నారని DCP జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నైజీరియాకు చెందిన జేమ్స్ వద్ద డ్రగ్స్ లేడి కిలాడి అనురాధ కొనుగోలు చేసింది. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయం చేస్తోంది మాయ లేడి.
పూర్తిగా చదవండి..drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా.. లేడి కిలాడి అనురాధ అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా ఉంచారు పోలీసులు. వరుసగా దాడులు చేస్తూ డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు.తాజాగా మోకిల పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Translate this News:











