AP BJP: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని విపక్షాలు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా, జై భీమ్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ చీఫ్ పురందేశ్వరి సంతకంతో కూడిన ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించారు. “తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్లుగా బీజేపీ లెటర్ హెడ్‌పై నేను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోంది .ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్కు కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాము” అని ట్వీట్ చేశారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.
పూర్తిగా చదవండి..AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని విపక్షాలు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా, జై భీమ్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ చీఫ్ పురందేశ్వరి సంతకంతో కూడిన ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించారు.

Translate this News:











