Arogya Mahila: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా మరో 100 మహిళా కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 12 నుంచి అదనంగా వీటిని ప్రారంభించాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా తాజాగా మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడంతో ఆ సంఖ్య 372కు పెరగనుంది.
పూర్తిగా చదవండి..Arogya Mahila: తెలంగాణ మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం
తెలంగాణ మహిళకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా మరో 100 మహిళా కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

Translate this News:











