Explainer: India, Bharat names history: “జనగణమన అధినాయక జయహే.. ‘భారత’ భాగ్యవిధాతా” తో మొదలయ్యే జాతీయ గీతం ‘జై హింద్’తో ముగుస్తుంది. అంటే జాతీయ గీతంలో భారత్ అనే పదంతో పాటు పరోక్షంగా ‘హింద్’ అనే పదం కూడా ఉంది. సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.. ఎక్కువ భాగం సింధూ నది పాక్‌లోనే ఉంది. ఈ ‘సింధ్’ నుంచే హింద్, హిందుస్థాన్.. ఇండియా పదాలు వచ్చాయి. 400 BCEలో మెగస్తనీస్ ‘ఇండికా’ని ఉపయోగించారు. 18వ శతాబ్దం నాటికి బ్రిటీష్ వాళ్లు ఎక్కువగా ఇండియా అనే పేరును మ్యాప్స్‌లో తీసుకొచ్చి పెట్టారు. ఇక మన దేశానికి మరో పేరైన ‘భారత్’ సంస్కృతం నుంచి తీసుకున్న పదం. పురాణ రాజు భరతుడితో ఈ పేరు ముడిపడి ఉందని చెబుతారు.. మరికొందరు ఈ పేరు వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయంటారు. ప్రస్తుతం ‘ఇండియా’ అనే పేరును తొలిగించి కేవలం ‘భారత్’ అనే పేరునే వాడాలని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. దేశం పేరు మార్పుకు సంబంధించి రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం బిల్లును కూడా ప్రవేశపెట్టనుందన్న ప్రచారం జరుగుతోంది.
India vs Bharat: ఇండియా వర్సెస్ భారత్ చరిత్ర ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది?
'ఇండియా' పేరును పూర్తిగా తొలగించి కేవలం 'భారత్' అనే పేరునే అధికారికంగా ఉపయోగించాలని కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. జీ20సమావేశాల విందు పిలుపులో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ప్రింట్ చేయడం రచ్చకు దారి తీసింది. దీంతో అసలు ఈ 'ఇండియా', 'భారత్' అనే పేర్లు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై నెటిజన్లు గూగుల్‌లో తెగ సేర్చ్ చేస్తున్నారు.

Translate this News:














