TTD Employee Illicit Relationship : వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్ధానం(TTD)లో అసిస్టెంట్ షేరాబ్ గా విధులు నిర్వహిస్తున్న తులసీ రామ్(tulasi ram)..వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య నుండి విడిపోవాలని తులసి రామ్ అనేక సందర్భాల్లో భార్య భారతి(Bharati)ని చిత్ర హింసలకు గురి చేసేవాడు. విడాకులు కావాలని తన బంధువుల చేత బెదిరింపులకు పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన భారతి గత వారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది.
పూర్తిగా చదవండి..TTD Employee Illicit Relationship : ప్రేయసి కోసం భార్యకు వేధింపులు కిరోసిన్ పోసుకుని..
భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భరించలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్ధానంలో అసిస్టింట్ షరాబ్గా విధులు నిర్వహిస్తున్న వై.తులసి రామ్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఈ విషయంలో భార్య భర్తలు గొడవలు పడేవారు. విడాకులు కావాలంటూ భర్త తులసీ రామ్ తోపాటు అతని మేనమామ సైతం బెదిరింపులకు పాల్పడ్డంతో భార్య భారతి కిరోసిన్ పొసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది.

Translate this News:











