Home Minister Amit Shah: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉదయనిధి ప్రకటనపై అధికార ఎన్డీయే కూటమి(NDA) ప్రతిపక్షాలపై మండిపడుతోంది. తాజాగా ఉదయనిధి ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా ముఖ్యమంత్రి కుమారుడు మాట్లాడుతున్నారని అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు. విపక్ష నేతలంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Amit Shah: ‘ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు’.. ఉదయనిధిపై అమిత్ షా ఫైర్..
ఓరాజస్థాన్లోని దుంగార్పూర్లో బీజేపీ 'పరివర్తన్ సంకల్ప్ యాత్ర'లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్బంగా ప్రసంగించిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గత రెండు రోజులుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని, కేవలం టు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

Translate this News:











