Rahul Gandhi vs PM Modi : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ‘కాంగ్రెస్ రహిత భారత్’ ప్రచారాన్ని ఎగతాళి చేసిన వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లండ్ కే సాధ్యం కాలేదు..ప్రధాని మోదీకి ఎలా సాధ్యం అవుతుందన్నారు. ముంబయిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక కాంగ్రెస్-ముక్త్ భారత్ అన్నారు. మీకు నినాదం గుర్తుందా? ఇంగ్లండ్ ప్రపంచంలోనే సూపర్ పవర్, అది భారతదేశాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చలేకపోయింది, అయితే మోడీ ఎలా చేస్తారు? ఇలా మాట్లాడిన రాహుల్ మళ్లీ అదానీ పేరు చెప్పి ప్రధాని మోదీని దుయ్యబట్టారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: వాళ్లవల్లే కాలేదు…మీ వల్ల ఏమౌతుంది..మోదీకి రాహుల్ కౌంటర్ ..!!
విపక్షాల కూటమి కలిసికట్టుగా ఉంటే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 60 శాతం ప్రజలకు ప్రతిపక్ష కూటమి ప్రతినిధి అని అన్నారు. అటు ప్రధాని మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండే కాంగ్రెస్ ను ఏం చేయలేకపోయింది...ఇప్పుడు మోదీ ఏం చేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు అదానీ విషయంలో మరోసారి మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.

Translate this News:











