Quake on Moon: భూమిపై సంభవించే ప్రకంపనల లాగానే చంద్రుడిపై కూడా ప్రకంపనలు కలుగుతాయా? జాబిల్లిపై రహస్యాలను ఛేదిస్తోన్న చంద్రయాన్-3 పరిశోధనలో ఇది తేలిందా? అంటే అవుననే అంటోంది ఇస్రో. జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 మూన్ మిషన్ నిర్వహించిన మరో ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగం ఫలితాలను ప్రకటించింది. ఇక్కడ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఒక ఘటనను రికార్డ్ చేసింది. “సహజంగా కనిపిస్తుంది”. ఈ ఘటనపై మరింత లోతుగా పరిశోధన చేస్తున్నామని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.
పూర్తిగా చదవండి..Big News: చంద్రుడిపై ప్రకంపనలు..అచ్చం భూకంపం లాగానే.. గుర్తించిన చంద్రయాన్-3!
జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. జాబిల్లిపై ప్రకంపనలను ఇస్రో పరిశోధనలు గుర్తించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఈ ప్రకంపనలు రికార్డ్ చేసింది.

Translate this News:











