సీపీయస్ ఉద్యోగుల రేపటి(సెప్టెంబర్ 1) ఛలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిమితమైన ఆంక్షలతో కూడిన అనుమతులతో ఛలో విజయవాడ కార్యక్రమం జరుపుకోమని హైకోర్టు చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులు ఐడీ కార్డులను చూపించాలని కోర్టు తెలిపింది. నిజానికి గతంలో ఛలో విజయవాడ సందర్భంగా చోటుచేసుకున్న ఎపిసోడ్ల కారణంగా ఈసారి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం తరుపు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. అనుమతులు ఇవ్వొద్దని కోరారు. అయితే నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగబద్దమని.. ప్రతి ఒక్కరి హక్కు అని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..Chalo Vijayawada: ఐడి కార్డులు చూపించాలి.. ఛలో విజయవాడకు హైకోర్టు ఓకే.. కండీషన్స్ అప్లై!
కొన్ని షరతులతో 'ఛలో విజయవాడ'కు హైకోర్టు అనుమతించింది. 500 మందితో పరిమితమైన ఆంక్షలతో ధర్నా చౌక్‌లో ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల ముందు ధర్నాలో పాల్గొనే ఉద్యోగులు ఆధార్ కార్డులు పోలీసులకు అందించాలని హైకోర్టు చెప్పింది.

Translate this News:











