Tirumala Brahmotsavam: శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏం అన్నారంటే:
TTD: సీఎం చేతుల మీదుగా శ్రీనివాససేతు ప్రారంభోత్సవం.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు!
తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాససేతు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ధర్మారెడ్డి. ఇక సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులు వేచి ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Translate this News:











