Asia Cup 2023 : బెసిక్స్ మరిచిపోతే ఎలా..? రన్ చేసేటప్పుడు గాల్లోకి ఎగురుతారా? ఇదెక్కడి వింత మావా.. పాకిస్థాన్ అంటే అంతే ఉంటుంది మరి.. చిత్ర విచిత్రంగా మిస్ ఫీల్డ్‌లు చేయడం.. క్యాచ్‌లు డ్రాప్ చేయడం.. అనూహ్యమైన రీతిలో రన్అవుట్లు అవ్వడం పాక్‌కి బటర్‌తో పెట్టిన ఎడ్యూకేషన్. ఫాస్ట్ బౌలర్లకు కేరాఫ్ అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ.. క్రికెట్లో లేజీనెస్ మాత్రం వారికి తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. నాటి ఇంజిమమ్ నుంచి నేటి రిజ్వాన్ వరకు వెరైటీగా అవుట్ అవ్వడంతో పాక్‌కి పాకే సాటే! తాజాగా జరుగుతున్న ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Asia cup: ఇదెక్కడి రన్ అవుట్‌రా బాబు.. ఎంతైనా పాక్ కదా.. అశ్విన్ కామెంట్స్!
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్రవిచిత్రంగా రన్అవుట్లు అవుతుంది. పాకిస్తాన్ బ్యాటర్లు రన్ అవుట్ల రూపంలో పెవిలియన్‌కు చేరుతున్నారు. ఓపెనర్ ఇమాముల్ హక్ (5) రన్అవుట్ తర్వాత రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. 'త్రో'కి భయపడి రిజ్వాన్ గాల్లో ఎగరగా.. అదే సమయంలో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోకి దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకింది. హెల్మెట్ పెట్టుకోని ఉంటే రిజ్వాన్ ఇలా భయపడి గాల్లోకి ఎగిరేవాడు కాదని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Translate this News:











