LPG price cut by Rs 200: క్రెడిట్ స్టీలింగ్ అన్నది ఆర్ట్.. అది అందరికి సాధ్యమయ్యే పని కాదు. కొందరు మాత్రమే అందులో ఎక్స్పర్ట్స్.. ముఖ్యంగా రాజకీయ నాయుకులు ఇందులో ఫస్ట్ ఉంటారు. ఏదైనా ప్రజలకు మంచి జరిగే విషయం ఉంటే అది తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. రక్షా బంధన్ గిఫ్ట్ అంటూ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 14కేజీల సిలిండర్‌పై 200రూపాయల వరకు తగ్గించింది. ఇది ప్రజలకు ఊరటనిచ్చే అంశమే.. ఎందుకంటే ఇప్పటికే నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి.. మార్కెట్లో ఏం కొనేట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఇలాంటి సమయంలో సిలిండర్‌పై రూ.200 వరుకు తగ్గింపు అంటే మంచి విషయమే..అయితే ఈ అంశంలో క్రెడిట్లు తీసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటి పడుతున్నాయి. బీజేపీ, యాంటీ-బీజేపీ పార్టీలు తమ ఖాతాలో క్రెడిట్లు వేసుకునేందుకు ఎగబడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Cylinder price: సిలిండర్ ధరల తగ్గింపుపై ట్విట్టర్లో యుద్ధం.. క్రెడిట్ల కోసం వెంపర్లాట.. అసలు మేటరేంటంటే?
వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రు.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే INDIA కూటమికి భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని యాంటి-బీజేపీ పార్టీలు విమర్శిస్తుండగా.. ఇదంతా మోదీ ప్రజల మంచి కోసం చేశారని బీజేపీ క్రెడిట్లు ఇచ్చుకుంటుంది. మరోవైపు మిగిలిన నిత్యావసర ధరలను కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

Translate this News:











