Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. సోమవారం (August 28) ఇమ్రాన్ ఖాన్‌పై దేశద్రోహం కేసును పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అటాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ కు నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్ అందిస్తున్నట్లు వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్‌కు అటాక్ జైలులో అతని ప్రొఫైల్, చట్టపరమైన స్టేటస్ ను పరిగణనలోకి తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు సమాచారం అందిందని ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది . వాస్తవానికి, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిని తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు నివేదిక కోరింది, ఆ తర్వాత జైలు పరిపాలన తరపున అటార్నీ జనరల్ కార్యాలయం కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Imran Khan : నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్, ఎయిర్ కూలర్…అదృష్టం అంటే నీదే సామి..!!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం (ఆగస్టు 28), ఇమ్రాన్ ఖాన్‌పై దేశద్రోహం కేసును పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అటాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇమ్రాన్ కు దేశీ నెయ్యితో చేసిన చికెన్, మటన్ అందిస్తున్నారట జైలు అధికారులు.

Translate this News:











