APPSC Group 1 and Group 2 Posts: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్ 1లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మిగిలిన ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-2, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, బీసీ సంక్షేమ శాఖ, ఆర్ధిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు భవనాల శాఖల్లోని ఖాళీలను గ్రూప్ 1 పోస్టుల ద్వారా.. ఏపీ సచివాలయంలోని ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయ, లెజిస్లేచర్ శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు ద్వారా APPSC భర్తీ చేయనుంది
పూర్తిగా చదవండి..APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Translate this News:











