రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, దివంగత నేత సాయిచంద్ సంతాప సభ సోమవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. సాయిచంద్ స్వగ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రులు సాయిచంద్ చెల్లి వేదాకు, తండ్రి రాములుకు చెరో 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కాగా ఇటీవలప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాడంతో ఆ విషయంపై ఆర్టీవీ బాల్క సుమన్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకొని తిరిగాడు. ఆర్టీవీ బీఆర్ఎస్ కోవర్టుల గురించి మరోసారి ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఎంతకీ నోరు విప్పని బాల్క సుమాన్ ఆర్టీవీ రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిపోయాడు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు బాల్క సుమన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..నోరు విప్పని ప్రభుత్వ విప్.. రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిన వైనం
ప్రభుత్వ విప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆర్టీవి ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బాల్క సుమన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అంతేకాదు ఆర్టీవీ రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే అతన్ని తోసివేస్తే వెళ్లాడు. కాగా బాల్క సుమన్ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Translate this News:











