సిద్ధిపేట జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదుల చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్ధిపేట నియోజకవర్గంలో ఆలయ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. వారికి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటికే 50కి పైగా దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదలైనట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా తాను వ్యక్తిగతంగా వందల సంఖ్యలో దేవాలయాల అభివృద్ధి కోసం సహకారం అందించానన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల
సిద్ధిపేట జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు కాపీలను మంత్రి హరీష్రావు దేవాలయ అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.

Translate this News:











