కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ఫోకస్ పెట్టేశాయి. గ్యాపు లేకుండా వరుస పెట్టి మరి అక్కడ బహిరంగ సభలు పెడుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్లో ఖమ్మం నేతల్లో అసంతృప్తి నెలకొన్నా.. మరోవైపు బీజేపీ.. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం జిల్లాకు రానున్నారు. అగ్రనేతలు తెలంగాణకు రాకతో మళ్లీ బీజేపీలో జోరు పెంచుతోందని ప్రజలు అనుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..khammam: రామయ్య దర్శనం కాకుండానే.. బహిరంగ సభకు అమిత్షా
సమయం తక్కువ ఉండటం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అయిందని బీజేపీ యంత్రాంగం ప్రకటించింది.

Translate this News:











