సౌతాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన సంభాషణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. దీనిపై పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. చైనీయులకు భయపడకుండా భారత వీర సైనికులు 40 నెలల పాటు సరిహద్దుల్లో నిలబడ్డారని.. అలాంటప్పుడు మోదీ ఎందుకు జిన్పింగ్ ముందు నిలబడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు చైనా సైనికులు భారత భూభాగంలో ఆక్రమణలకు పాల్పడుతుంటే..మోదీ మాత్రం జిన్పింగ్ వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని ఒవైసీ ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..మోదీ, జిన్పింగ్ సంభాషణపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్పింగ్ మధ్య జరిగిన సంభాషణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. దీనిపై పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

Translate this News:











