ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగ్గా కేజ్రీవాల్, వర్సిటీల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
పూర్తిగా చదవండి..కేజ్రీవాల్ కు చుక్కెదురు…. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు…!
సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ఎదుట పెండింగ్ లో వుందన్నారు. అందువల్ల ఇప్పుడు స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏమైనా సమస్యలు వుంటే గుజరాత్ హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించింది.

Translate this News:











