Chandrayaan-3 First Image of Rover Pragyan : ఇస్రో అనుకున్నది అనుకున్నట్లే జరుగుతోంది. ల్యాండర్ సమయానికి సేఫ్ ల్యాండ్ అయ్యింది. తర్వాత రోవర్ కూడా ఇస్రో అనుకున్న సమయానికే జాబిల్లిపై అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో షేర్ చేసింది. ఈ ప్రగ్యాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి పరిస్థితులను ఇస్రోకు షేర్ చేయనుంది. చంద్రునిపై సెకనుకు సెంటిమీటర్ చొప్పున ముందుకు కదలుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రునిపై నాలుగు సింహాలు, ఇస్రో చిహ్నాన్ని చంద్రుని ఉపరితలంపై ముద్ర వేయనుంది. ర్యాంప్ పై ల్యాండర్ నుండి రోవర్ (Rover Pragyan) బయటకు వస్తున్న మొదటి ఫొటోను ( First Photo Of Moon)అంతరిక్ష నౌక పంపించింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన వెంటనే, అంతరిక్ష యాత్రలో భారతదేశం కొత్త చరిత్ర సృష్టించింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ జాబిల్లిపై రోవర్ ప్రయాణం.. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం..!!
చంద్రయాన్-3 జాబిల్లిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయ్యింది. ర్యాంప్‌పై ల్యాండర్ నుండి రోవర్ బయటకు వస్తున్న మొదటి ఫోటోను అంతరిక్ష నౌక తీసింది. అంతకుముందు, చంద్రయాన్-3 ద్వారా క్లిక్ చేసిన చంద్రుని ఉపరితలం ఫోటోలను ఇస్రో విడుదల చేసింది.

Translate this News:











