Megastar Tagore Hospital Scene Repeat in Anantapur Private Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించి ‘ఠాగూర్’ సినిమాలోని కొన్ని సీన్లు అలా గుర్తిండిపోతాయి. అందులో ఒకటి ఆస్పత్రిలోని సీన్. ఈ సీన్.. ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులకు చమటలు పెట్టిందింది. ఈ సినిమాలోని ఉన్న కొన్ని సీన్లు నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో ఆస్పత్రిలోని సీన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని నమ్మించి, కొన్ని గంటల పాటు చికిత్స చేసి.. లక్షల రూపాయలు గుంజుకోవడానికి నాటకం ఆడారు. సరిగ్గా అలాంటి సీనే తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నాలుగు గంటల పాటు ఓ ఆస్పత్రి సిబ్బంది నాటకం ఆడారు. సీన్ కట్ చేస్తే.. అసలు విషయం బయట పడింది.
పూర్తిగా చదవండి..Anantapur: అనంతపురంలో ‘ఠాగూర్’ మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.

Translate this News:











