ఓ వైపు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాకు సీఎం కేసీఆర్ సిద్ధం అయితే.. మరోవైపు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతం మైనంపల్లి సన్నిహితులతో మాట్లాడుతూ హరీష్ రావును గద్దె దించే వరకు నిద్రపోనని తెలిపారు. మల్కాజిగిరిలో తాను, మెదక్‌లో తన కుమారుడు ఇద్దరం పోటీ చేస్తామని స్పష్టంచేశారు. మెదక్‌లో హరీష్ పెత్తనం ఏంది? అని ప్రశ్నించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి హరీష్‌రావే కారణమన్నారు. మెదక్‌లో హరీష్ వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతానని తెలిపారు.
పూర్తిగా చదవండి..Mynampally: సిద్ధిపేటలోనే నిన్ను ఓడిస్తా.. హరీష్‌రావుకు మైనంపల్లి వార్నింగ్
తెలంగాణ మంత్రి హరీష్‌రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో హరీష్ రావు పెత్తనం ఏంది? అని ప్రశ్నించారు. మెదక్‌లో హరీష్‌రావు వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతానని హెచ్చరించారు.

Translate this News:











