తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండటం కోసం కాదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన బీజేపీ బహిరంసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్కు ఇప్పుడున్న ఎంపీ స్థానాలు కూడా రావని.. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు రెడీగా ఉన్నారని జోస్యం చెప్పారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ మారిందని విమర్శించారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ పాలనలో అవినీతి రాష్ట్రంగా తెలంగాణ: కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరం గులాబీ పార్టీ ఏటీయంగా మారిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా కేసీఆర్ మార్చేశారని.. భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Translate this News:











