Russia mission failed, chandrayaan near to success: అంతరిక్షంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన రష్యా.. చంద్రుడి విషయంలో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతుంది? అంతరిక్షంలో ప్రయోగాలు మొదలుపెట్టిందే నాటి సోవియట్ యూనియన్(USSR) కదా. స్పెస్‌లో ప్రపంచానికే కొత్త పాఠాలు నేర్పిన సోవియట్.. మూన్ రేస్‌లో మాత్రం వెనకపడిపోయింది. రష్యా ప్రయోగించిన లూనా-25(Luna-25) స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. చంద్రుడిపై దిగే సమయంలో ల్యాండర్ క్రాష్ అయ్యింది. దాదాపు అర్థ శతాబ్దం తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగం చేపట్టగా అది కాస్త బెడిసికొట్టింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే రెండు రోజుల ముందుగానే లూనా-25(Luna-25) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. రష్యా సైంటిస్టుల ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
➼ అమెరికా కాదు.. ఇందులో రష్యానే తోపు:
పోటీ ఏదైనా.. రంగం ఏదైనా ఫస్ట్ ఎవరన్నదాన్నే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. అంతరిక్ష ప్రయోగాల గురించి చర్చ వచ్చిన ప్రతీసారి రష్యా(నాటి సోవియట్) గొప్పతనం వినిపిస్తూనే ఉంటుంది. కంటికి కనిపిస్తూనే ఉంటుంది. అంతరిక్ష యుగం ప్రారంభ రోజులలోనే సోవియట్ సత్తా చాటింది. ప్రపంచానికే దశ, దిశ చూపింది. ఏ రంగంలోనైనా అమెరికాపై ఆధిపత్యం చెలాయించడం అసాధ్యమనే భావన పెన వేసుకుని ఉన్న నాటి కాలంలో సోవియట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అంతరిక్షానికి కొత్త దారులను చూపించింది. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ గాల్లోకి రయ్రమ్మంటూ సోవియట్ రాకెట్లు దూసుకుపోయాయి.
Luna-25: చంద్రయాన్ గెలిచింది..రష్యా ఓడింది.. ఇది ఇండియా గెలుపే బాసూ!
అంతరిక్షంలో ప్రపంచానికే దశ, దిశ చూపి అగ్రదేశం అమెరికాకే కొత్త పాఠాలు నేర్పిన రష్యాకు చంద్రుడిపై ప్రయోగాలు మాత్రం పెద్దగా కలిసిరావడంలేదు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టాల్సిన రష్యా స్పెస్ క్రాఫ్ట్ లూనా-25 కూలిపోయింది. అదే సమయంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిపై విజయాన్ని అందుకునేందుకు సిద్ధమైంది.

Translate this News:











