జనగామ బీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం ముత్తిరెడ్డి, పల్లా వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ముత్తిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కేసీఆర్ ఏది చెబితే అదే చేస్తానని తెలిపారు. అయితే తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. కొన్నిరోజులుగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతరవకు టిక్కెట్లను ప్రకటించలేదని కానీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ తనకే టికెట్ దక్కిందని కార్యకర్తలకు చెబుతున్నారన్నారు. పల్లా వెంట కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లా పాత్ర ఏంటని నిలదీశారు. జనగామలో పల్లా రాజేశ్వర్ కుట్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.
పూర్తిగా చదవండి..కార్యకర్తల ముందు కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి
కొంతకాలంగా జనగామ బీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం ముత్తిరెడ్డి, పల్లా వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ముత్తిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

Translate this News:











