Anasuya Bharadwaj breaks down on Instagram: బయటకు ఎంతో ఆనందంగా.. చలాకీగా.. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే యాంకర్ అనుసూయ వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె ఏడుపు చూసిన హేటర్స్లో కొంతమంది పబ్లిసిటీ కోసం ఏడుస్తుందని కామెంట్లు చేయగా.. ప్రతి మనిషి బయట ఎంత హ్యాపీగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధ పడుతుంటారని మరికొందరు అంటున్నారు. ఇది నిజమే.. డిప్రెషన్, బాధ అంటే సినిమాల్లో చూపించినట్టు హీరో మందు తాగి.. సిగరేట్లు ఒంటిపై కాల్చుకోవడం కాదు.. అందరిని నవ్విస్తూనే.. లోలోపల ఏడ్చేవాళ్లు చాలామందే ఉంటారు. సినీ సెలబ్రెటీలు అందుకు మినహాయింపు కాదు.
పూర్తిగా చదవండి..Anasuya: బోరున ఏడ్చిన అనుసూయ.. అసలేం జరిగింది?
యాంకర్ అనుసూయ(anasuya) ఏడుస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయని.. నేను కూడా చాలా బలహీనంగా ఉన్నానని రాసుకొచ్చింది. తనకి కూడా బ్రేక్ డౌన్స్ ఉంటాయని ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనుసూయ. జీవితంలో అందరికి చెడు రోజులు ఉంటాయని.. అందుకే అందరితో దయతో మెలగాలని కోరింది.

Translate this News:











