Husband killed his Wife with Knife at akividu in West Godavari District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత మార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది.
పూర్తిగా చదవండి..Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Translate this News:











