The Gmail mobile app now allows users to translate emails directly within the app: జీమెయిల్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతోంది. మొబైల్ యాప్ నుంచే ఇప్పుడు ఈమెయిల్స్ని ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ ఫీచర్ జీమెయిల్ వెబ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు అందుబాటులోకి వస్తోంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఏళ్లు పాటు 100కు పైగా భాషల్లో జీమెయిల్స్ని ట్రాన్స్‌లేట్ చేసుకున్నారని.. ఇప్పుడు మొబైల్ యాప్‌లోనూ ఈ అనువాదం అందుబాటులోకి వచ్చిందని చెప్పింది.
పూర్తిగా చదవండి..Tech Tips: మొబైల్లో మెయిల్స్‌ను ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలి?
సగటు మనిషికి యావరేజ్‌గా రెండు భాషలపై టచ్ ఉంటుంది. అది కూడా ఆ సంబంధిత భాషల్లో ఎక్స్పర్ట్ ఐఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐటీ రంగంలో వివిధ భాషలకు చెందిన వారితో డీల్ చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా మెయిల్స్ చుట్టునే పని జరుగుతుంది. సంబంధిత వ్యక్తి మనకి తెలిసిన భాషలోనే మెయిల్ పంపాలని లేదు. అందుకే మెయిల్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు గూగుల్ మొబైల్ యాప్‌ని సంస్థ అప్డేట్ చేసింది.

Translate this News:











