Unacademy Teacher’s Remarks controversy: ప్రముఖ ఎడ్యు-టెక్ సంస్థ ‘అన్అకాడమీ'(Unacademy)ని అన్ఇన్స్టాల్(Uninstall) చేయాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. రైట్‌వింగ్, బీజేపీ మద్దతుదారులు ఈ ట్వీట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ‘అన్అకాడమీ’ క్లాసులు వినవద్దని ట్వీట్లు పెడుతున్నారు. ఈ ఎడ్యుకేషనల్ ఫ్లాట్‌ఫామ్ బీజేపీ నేతలను అవమానించేలాగా పని చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ పెను దుమారాన్ని రేపుతోంది. ‘అన్అకాడమీ’ విషయంలో గ్రూపులుగా వీడిపోయి మరి లెఫ్ట్‌వింగ్, రైట్‌వింగ్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ‘అన్ అకాడమీ’ ట్రెండ్.. అసలేంటి వివాదం?
ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'అన్అకాడమీ'ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్‌మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ సపోర్టర్స్. విద్యావంతులైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడుతూ కరన్ క్లాసు రూమ్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇప్పటికే కరన్‌ని జాబ్ నుంచి తీసేసింది అన్అకాడమీ. అయినా కూడా ఈ గొడవ చల్లారేలాగా కనిపించడంలేదు. క్లాస్ రూమ్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతుండగా.. చదువుకున్న వాళ్లకి ఓటు వేయమనడం తప్పెలా అవుతుందని మరికొందరు అంటున్నారు.

Translate this News:











