కర్ణాటక విజయంతో కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది. కన్నడ నాట లభించిన విజయంతో ఇటు తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. దీంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి అనే విషయంలో హస్తం పార్టీ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే దరఖాస్తుల ప్రక్రియకు తెరలేపినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ప్రక్రియ వెనుక ఎవరి ఊహలకు అందని వ్యూహాలను అదిష్టానం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..గాంధీ భవన్లో టికెట్ల జాతర….కాంగ్రెస్ వ్యూహం అదేనా…!
గాంధీ భవన్ లో టికెట్ల జాతర నడుస్తోంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని కోసం ఇప్పటికే నమూనా అప్లికేషన్, దరఖాస్తులను ఫైనల్ చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకోవాలని పార్టీ వెల్లడించింది. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Translate this News:











