Cheetah in Tirumala: తిరుమల శేషాచల కొండల్లో గత కొద్ది రోజులుగా వన్య మృగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు.. ఎలుగుబంటి తరచు హల్చల్ చేస్తూ భయానికి గురి చేస్తున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంటున్నాయి. తాజా చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటన తిరుమలలో కలకలం సృష్టించింది. దీంతో టీటీడీ అప్రమత్తం అయింది. దాదాపు 25-30 చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న టైంలోనే ఎలుగుబంటి కనిపించటంతో కలకలంగా మారింది. కాలినడకన మార్గంలో వెళ్తున్న భక్తుల కోసం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో మరో చిరుత కదలికలు.. కొనసాగుతున్న ఆపరేషన్
ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి.

Translate this News:











