Caught on camera-Dehradun Defence College collapses in heavy rain in Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పదులు సంఖ్యలో మరణాలు సంభవించగా.. తీరని నష్టం వాటిల్లింది. కొండ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డెహ్రాడూన్(Dehradun) డిఫెన్స్ కాలేజీ భవనంలో కొంత భాగం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..!
ఉత్తరాఖండ్‌లో దంచికొడుతున్న వర్షాలకు బిల్డింగులు కూలిపోతున్నాయి. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కొంతభాగం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 17వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడు మరోసారి పగబట్టాడు. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి.

Translate this News:











