Cricket vs Hockey prize money: మనదేశంలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరే ఫీల్డ్కి ఉండదు. సినిమా రంగం కూడా క్రికెట్ తర్వాతే. క్రికెటర్లు సంపాదించే డబ్బులు కోట్లలో ఉంటాయి.. వాళ్లు తాగే మంచినీళ్ల వాటర్ బాటిలే వేలలో ఉంటుంది. మిగిలిన క్రీడాకారులకు ఈ లక్ ఉండదు. టాలెంట్ ఉన్నా ఇతర స్పోర్ట్స్‌కి చెందిన ఆటగాళ్లు సంపాదన అంతంతమాత్రమే. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒలింపిక్ మెడల్స్ కొడితే కానీ గుర్తించవు. ఇక 2021 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. 41 ఏళ్ల నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదింపుతూ మూడో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయినా ఆ జట్టు ఆటగాళ్ల తలరాతలు మారిపోలేదు.. కోట్లకు కోట్లు సంపాదించుకోలేదు. ఎందుకంటే వాళ్లు క్రికెటర్లు కాదు. తాజాగా ఆసియా ఛాంపియన్షిప్ హాకీ విజేతగా నిలిచిన టీమిండియాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
పూర్తిగా చదవండి..Hockey: మరీ ఇంత దారుణమా! క్రికెటర్లకేమో కోట్లకు కోట్లు.. హాకీ ఆటగాళ్లకు చిల్లర పైసలా?
క్రికెట్ వర్సెస్ హాకీ ఫ్రైజ్ మనీ లెక్కలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటివలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేసియాపై భారత్ జట్టు గెలిచింది. ఈ గేమ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి ఇచ్చింది 17వేల రూపాయలేనట. అదే క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి లక్షలు ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతకు 48లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఉండగా.. క్రికెట్లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు ఇస్తారు.

Translate this News:












