అభ్యర్థుల నిరసనలకు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సర్కార్.. ఈ నెల(ఆగస్టు) 29, 30 జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ తెలిపినట్లు చెప్పారు కేటీఆర్. ప్రతి అభ్యర్ధి అర్హత ఉన్న అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సెక్రటరీలతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్రూప్-2 పరీక్షల విషయమై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎగ్జామ్స్‌ని వాయిదా వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే వాయిదా డేట్లకు సంబంధించి కమిషన్ నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అది ఇవాళే(ఆగస్టు 13) రావొచ్చు. మరోవైపు రేపు(ఆగస్టు 14)కూడా గ్రూప్ 2 వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. విచారణ ప్రారంభం అయ్యేలోపే కొత్త డేట్లను కూడా టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా?
వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది.

Translate this News:











