Bholashankar Movie: ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్స్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మేశారు. నెట్ ఫ్లిక్స్ నుంచి నిర్మాత కొంతమొత్తం అడ్వాన్స్ రూపంలో అందుకున్నాడు కూడా. ఇప్పుడు మిగతా మొత్తం కావాలంటే, కోర్టు కేసు క్లియర్ అవ్వాల్సి ఉంది. కేసును క్లియర్ చేయాలంటే, డిస్ట్రిబ్యూటర్ సతీష్‌కు సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో భోళాశంకర్ డిజిటల్ రైట్స్‌కు ఈ కేసుకు లింక్ పడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఏజెంట్ సినిమా టైమ్‌లో తన నుంచి అనీల్ సుంకర 30 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్ సతీష్. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇస్తానని హామీ ఇచ్చారట. కానీ సతీష్‌కు మాత్రం కేవలం వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు మాత్రమే ఇచ్చారంట.
Bholashankar Movie: ఏకే ఎంటర్ టైన్మెంట్స్.. ఈసారి నెట్ ఫ్లిక్స్‌తో తకరారు
భోళాశంకర్ సినిమా విడుదలకు ముందు నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్, నిర్మాత అనీల్ సుంకరపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన కోర్టు.. సతీష్ వేసిన 4 పిటిషన్లను కొట్టేసింది. అయితే మరో పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అదే భోళాశంకర్ స్ట్రీమింగ్ రైట్స్.

Translate this News:











