MLA Harish Rao: రాష్ట్రంలో బీసీ బంధు (BC Bandhu) ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. బీసీబంధుకు అర్హులైన 300 మందికి లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీలను రెగ్యులరైజ్ చేస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో పంచాయతి సెక్రెటరీలను రెగ్యులరైజ్ చేస్తూ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఎం తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు కూడా పంచాయతీ సెక్రెటరీలను నియమించినట్లు మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. దీని వల్ల 10 వేల మందికి ఉపాధి కల్పించినట్లైందన్నారు.
పూర్తిగా చదవండి..MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.

Translate this News:











