సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ChatGPT తప్పు సమాధానాలు: ఛాట్‌జీపీటీ(ChatGPT)ని అతిగా నముతున్నారా? అడిగిన వెంటనే ఆన్సర్ ఇస్తాడు కదా అని ప్రతి డౌట్‌ని టైప్ చేసి పడేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది కదా అని గుడ్డిగా ఫాలో అవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఛాట్‌జీపీటీ చెప్పిన ఆన్సర్లను క్రాస్ చెక్ చేసుకోకపోతే మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఛాట్‌జీపీటీ తప్పుడు సమాధానాలు చెబుతాయని నివేదికలు తేల్చాయి. అది కూడా ఒకటి అర తప్పులు కాదండోయ్.. 100 ప్రశ్నలు అడిగితే అందులో 52తప్పులు చెబుతుందట. మీరు నమ్మలేకున్నా ఇదే నిజం.
పూర్తిగా చదవండి..ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ!
ఛాట్‌జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్ ఓవర్‌ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు.

Translate this News:











