- 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తపించి తల్లైన మహిళ
- ఆసుపత్రిలో ముగ్గురు బిడ్డలకు జననం
- ప్రసవం అనంతరం చికిత్స పొందుతూ మహిళ మృతి
- తీవ్ర విషాదంలో మహిళ కుటుంబం
అమ్మా.. అనే పిలుపు కోసం ఆరాటపడని మహిళలు ఉండరు. ఆస్తుపాస్తులు లేకున్నా.. బిడ్డలుంటే చాలనుకుంటారు. ఇక బిడ్డల కోసం తిరగనా ఆస్పత్రి ఉండదు.. మొక్కని దేవుడూ ఉండడు. అలా ఓ మహిళ పిల్లల కోసం ఏకంగా 20 ఏళ్ల పాటు తపించింది. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చింది. కానీ అంతలోనే విధి కర్కశంగా కాటేసింది. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డల బోసినవ్వులు కూడా చూడకుండానే.. అమ్మా అనే పిలుపు వినకుండానే తనువు చాలించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ మండలంలో జరిగింది.
పూర్తిగా చదవండి..











